
నేను శిశిరమై నిల్చుంటానా..
సుడిగాలై వచ్చి..
నాలోని సిగ్గుటాకుల్ని రాల్చిపడేసి..
నన్ను చుట్టుకుపోతావు..
వసంతపు రంగుల పూవై విచ్చుకుంటుంటే..
తుమ్మేదై నాపై తూలిపోతావు.
ఆ మల్లెల మత్తు పరుచుకునే సంధ్యవేళనై.. వెలుగుతున్న నన్ను..
వెన్నెల తాపంతో వెంట పడి
అందుకోవాలని చూస్తావు..
కోయిల స్వరాన్ని మించిన మృదుత్వంతో
పలుకులై నన్ను మీటు తావు.
నీ చేతుల్లో ప్రేమను మించిన..
మరిదేన్నో నింపుకుని ఆమూలాగ్రం అభిషేకిస్తావు.
మత్తో, మైకమో తెలీని పరవశంలో పడేసి
నా ఆలోచనల్ని అనుభవాలన్నింటినీ ఖాళీ చేస్తావు .
తమకాన్ని తాకిన తనువు తరంగమౌతుంటే
మరలిపోతున్న అలా లాక్కెళ్లే ఇసుకలాంటి ఆనందాన్ని
జారిపోనివ్వకుండా దోసిళ్లతో తెచ్చి అణువణువులో నింపేస్తావు.
తొలి అడుగుల స్పర్శే కాదు..
తుది మలుపులు అంతంలోని..
ఆనందంమూ వర్ణంచలేను..
ప్రేమలోని ఆఖరి మజిలీ ఇంత బాగుంటుందా?
ఆ క్షణం నీవే నేను..
నేనే నీవు..
నీచేయి పట్టుకుని దాటుతున్న
ప్రతి మజిలీ మనసుకి కొత్త ప్రేమని రుచి చూపుతోంది..
మళ్ళీ మళ్ళీ మొగ్గ తొడిగే చివురుల్లా..
మజిలీ మజిలీకి నూతనోత్సాహంతో
మదిలో పొంగుతున్న ప్రేమ..
నీకు నేను కావాలి..
నాకు నీవు కావాలి..
అది ప్రతీ క్షణంలోనూ..
ప్రతి శ్వాసలోనూ..
ఇది నిజం..
12mar2020a
PRESSLINK:
Matthew 22: 37
Jesus said unto him, Thou shalt love the Lord thy God with all thy heart, and with all thy soul, and with all thy mind. Amen!!
https://www.facebook.com/13678589643/posts/10158413781904644/
https://www.facebook.com/325194978424425/posts/513658982911356/
